: చిలకలూరిపేటలో చంద్రబాబు రోడ్ షో
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బాబు నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ... జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. టీడీపీకి ఓటేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు కూడా పాల్గొన్నారు.