: సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి: కేకే
సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని, టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ నేత కేకే తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని, జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నీళ్లు, నియామకాల విషయంలో టీఆర్ఎస్ రాజీపడదని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని ఆయన స్పష్టం చేశారు.