: రామోజీ, చంద్రబాబును నడిరోడ్డుమీద నిలబెడతాం: గట్టు


రామోజీరావు, చంద్రబాబునాయుడు ఏ దేశం వెళ్లినా ఇద్దరినీ తీసుకొచ్చి నడిరోడ్డుమీద విచారణ చేస్తామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు హెచ్చరించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, రామోజీరావు మూటాముల్లె సర్దుకున్నారని అన్నారు. అలిపిరి ఘటన తరువాత ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరు ప్రయత్నించారో చంద్రబాబునాయుడుకే బాగా తెలుసని ఆయన చెప్పారు. అధికారం కోసం నానాపార్టీలతో కూటమి కట్టి, ఓడిపోయిన ఘనత బాబుదేనని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News