: సీమాంధ్రలో 48 గంటల పాటు మద్యం బంద్
సీమాంధ్రలో ఎల్లుండి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. పోలింగ్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేయనున్నారు. మద్యం అమ్మకాలపై ఎన్నికల అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచుతారు.