: గాడిద అంటావా? అంటూ భర్తను బోనులో నిలబెట్టిన భార్య


అందర్లోనూ తనను అవమానించాడనే ఆగ్రహంతో ఓ భార్య తన భర్తను కోర్టు బోనులో నిలబెట్టింది. సౌదీ అరేబియాలోని జెడ్డా కోర్టు ముందుకు ఓ కేసు విచారణకు వచ్చింది. తనను అవమానించడం తన భర్తకు ఓ వ్యాపకంగా మారిందని మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఆవు, గాడిదా అంటూ తనను దూషిస్తుంటాడని, చెప్పుకోలేని అసభ్య పదాలు వాడుతూ మానసిక హింసకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రెండు వారాల్లోగా కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ ఆమె భర్తకు సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News