: పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ నిషేధం: భన్వర్ లాల్


రాష్ట్రంలో పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఓటరు కానివాళ్లు ఇతర నియోజకవర్గాల్లో ఉండకూడదని, వారి ప్రాంతాలకు వచ్చేయాలని చెప్పారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి 6 వరకు సీమాంధ్రలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఎస్ఎంఎస్ ద్వారా ఓటరు తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రం కోసం ఎస్ఎంఎస్ పంపాల్సిన నంబరు - 92462 80027గా వెల్లడించారు. ఇక సీమాంధ్రలో సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని భన్వర్ లాల్ చెప్పారు. ఇక ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు కార్డు ఉంటే చాలని... ఓటరు స్లిప్ లేకపోయినా ఏదో ఒక ఐడీ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News