: ట్విట్టర్ లోకి రజనీకాంత్ అడుగుపెట్టాడు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించి తన అభిమానులకు మరింత చేరువవుతున్నారు. రజనీ నటించిన తాజా చిత్రం ‘కొచ్చాడియాన్’ (తెలుగులో విక్రమ సింహ) శుక్రవారం విడుదలవుతోంది. రజనీకాంత్ తాజాగా @SuperStarRajini అనే పేరుతో ట్విట్టర్ ఖాతాను ఇవాళ ప్రారంభించారు. ఇప్పటికే తొలి ట్వీట్ ను కూడా రజనీ రెడీ చేశారని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న రజనీకాంత్ పేరిట ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్లో ఎన్నో అభిమాన పేజీలున్న సంగతి తెలిసిందే. అయితే నేరుగా రజనీకాంత్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.