: వర్షం ఎంత పడిందో చెప్పే గొడుగు
గొడుగు ఎందుకు పనిచేస్తుంది? తడవకుండానే కదా. కేవలం తడవకుండా కాపాడడమే కాదు, వర్షం ఎంత కురిసిందో మిల్లీమీటర్లతో సహా కొలిచి స్మార్ట్ ఫోన్ కు సందేశం పంపించే ఓ గొడుగును నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్త రోల్ఫ్ హట్ తయారు చేశారు. ఈ గొడుగు పైభాగంలో సెన్సార్లు ఉంటాయి. ఎంత వర్షం పడిందో అవి కొలిచి, బ్లూటూత్ ఆప్షన్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు సమాచారం చేరవేస్తాయి.