: కాంగ్రెస్ నేతలు దొంగలు, దేశద్రోహులు: కేఏ పాల్
కాంగ్రెస్ నేతలు దేశాన్ని దోచుకున్న దొంగలని క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు దేశ ద్రోహులని అన్నారు. తాను ఈ ఆరోపణలు చేయడం లేదని, అది నిర్ధారణ అయిందని, కావాలంటే వారు చేసిన స్కాములను చూడొచ్చని ఆయన తెలిపారు. లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ ను ప్రజలు ఎన్నుకోరని ఆయన అన్నారు. వందల కోట్ల రూపాయలు దోచుకున్న నేతలపై విచారణలు జరగడం లేదని ఆయన చెప్పారు. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు.