: పిట్ బుల్.. భలే భలే..


కోల్ కతా మైమరిచింది. ఐపీఎల్ వేడుకల్లో బాలీవుడ్ తారల ప్రదర్శన ఒకెత్తయితే.. ఇంటర్నేషనల్ ర్యాప్ స్టార్ పిట్ బుల్ షోనే మరికాస్త ఎత్తు. ఆడియెన్స్ తమను తాము మరిచేలా సాగింది పిట్ బుల్ ప్రదర్శన. తన హిట్ గీతాలతో యువతరాన్ని ఉర్రూతలూగించాడు. ఈ సూపర్ స్టార్ షో కొనసాగుతున్నంత సేపూ వీక్షకులు కరతాళ ధ్వనులతో మోత మోగించారు. ఫ్యాన్స్ మూడ్స్ కు తగ్గట్టుగా గీతాలను ఎంపిక చేసుకుని ఆలపించిన పిట్ బుల్ నిజంగా ఎంటీవీ అవార్డులకు అర్హుడే అనిపించాడు.

2001లో తన ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ చేసిన పిట్ బుల్ పలుమార్లు ఎంటీవీ వేదికపై అవార్డులు అందుకున్నాడు. అమెరికన్ మ్యూజిక్ అవార్డు, టీన్ చాయిస్ అవార్డు, పీపుల్స్ చాయిస్ అవార్డులు ఈ ర్యాప్ కళాకారుణ్ణి వరించాయంటే అర్థమవుతోంది, ఎంతటి ప్రతిభావంతుడో. పాడడమే కాదు గేయ రచన కూడా చేస్తాడు.

ఇక, చివరగా పిట్ బుల్ తన జీవితాన్నే మార్చి వేసిన పాటంటూ.. 'నెగిటివ్ టు పాజిటివ్' అనే గీతాన్ని ఆలపించి కోల్ కతా వాసుల అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. పిట్ బుల్ ఈ పాటను పాడుతుండగా షారూఖ్, కత్రీనా, దీపికా ఆయనతో కలిసి హుషారుగా నర్తించారు. 

  • Loading...

More Telugu News