: హీరో రాజా రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ దుష్ప్రచారం
సినీ హీరో రాజా రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ ఫేస్ బుక్, ట్విట్టర్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే పెళ్లి చేసుకున్న రాజా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రాజా ఫొటోతో కొందరు పోస్టులు కూడా చేశారు. టీడీపీ, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని రాజా ఇటీవలే విమర్శలకు దిగిన విషయం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులే ఈ పనికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.