: జగన్ చెప్పేవన్నీ అవాస్తవాలే: జైరాం రమేశ్
వైఎస్సార్సీపీ అభ్యర్థి జగన్ పై సీమాంధ్ర ఎన్నికల పర్యటనలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జగన్ చెప్పేవన్నీ అవాస్తవాలేనని ఆరోపించారు. డెబ్బై బెడ్ రూమ్ లున్న రాజభవంతులు ఎలా వచ్చాయో చెప్పాలని, సునామీ వచ్చినట్లు జగన్ కు అంతడబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఐదేళ్లలో రాష్ట్ర విభజన ఫలితాన్ని సీమాంధ్ర ప్రజలు గమనిస్తారని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూస్తామన్న జైరాం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ 'విటమిన్ ఎం' సమస్య ఎదుర్కొంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో పథకాలన్నీ వైఎస్ అమలు చేశారన్నారు.