: మడతపెట్టుకోగల స్మార్ట్ ఫోన్
ప్రపంచంలోనే మడతపెట్టగల తొలి స్మార్ట్ ఫోన్ ను టొరొంటో శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనిని స్మార్ట్ ఫోన్ గా, ట్యాబ్లెట్ గా, నోట్ బుక్ గానూ ఉపయోగించుకోవచ్చు. ఇది మూడు భాగాలుగా ఉంటుంది. ఈ మూడింటినీ కలిపి ఒకే స్క్రీన్ గా లేదా మూడు స్క్రీన్లుగానూ వాడుకోవచ్చు. ఒక స్క్రీన్ ను కీ బోర్డుగా, మిగతా వాటిని ఒకే స్క్రీన్ గా ఎలా కావాలంటే అలా దానంతట అదే మారిపోతుంది. టొరొంటోలోని ఓ కాన్ఫరెన్స్ లో దీన్ని తాజాగా ఆవిష్కరించారు. దీని పేరు పేపర్ ఫోల్డ్.