: అదరగొట్టిన కత్రినా , దీపికా


ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు, కత్రీనా కైఫ్, దీపికా పదుకొనేలు తమ డ్యాన్సులతో అదరగొట్టారు. మహారాణిలా సింహాసనం అధిష్టించి వేదికపైకి వచ్చిన కత్రీనా 'మై నేమ్ ఈజ్ షీలా' అంటూ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. క్రిమ్సన్ కలర్ లెహంగాలో తళుక్కుమన్న ఆమె, అనంతరం 'చిక్నీ చమేలీ' అంటూ అందర్నీ మరో లోకానికి తీసుకెళ్ళింది. ఇక బ్లాక్ టైట్స్ లో దీపిక చూపరులను కట్టిపడేసిందనడంలో అతిశయోక్తి లేదు. డయాస్ పై ఆమె స్టెప్పులకు మైదానం ఊగిపోయింది. వీరిద్దరూ పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ ను ప్రదర్శించి ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి సిసలైన జోష్ తెచ్చారు.  

  • Loading...

More Telugu News