: పవన్ కల్యాణ్ ప్రచారం ఓట్లు రాబట్టలేదు: వంగవీటి రాధ
టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలిపి ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైకాపా నేత వంగవీటి రాధ సెటైర్లు విసిరారు. సినీ నటుడైన పవన్ ప్రచారం ఓట్లను రాబట్టలేదని ఎద్దేవా చేశారు. సినీ హీరో అయినందువల్ల ఆయనను చూడటానికి మాత్రమే జనాలు వస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలంతా రాజకీయ నాయకులైతే, తమ పార్టీ నేతలంతా ప్రజా నాయకులని... ఓటర్లు ప్రజా నాయకులనే ఎన్నుకుంటారని చెప్పారు. విజయవాడలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను వైకాపానే గెలుస్తుందని అన్నారు.