: 16న వాస్తవాలు బయటపడతాయి: డీఎస్
కొన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని టీకాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని... అలాగే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. 16వ తేదీన (కౌంటింగ్ డే) అన్ని వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. బీజేపీ నేతల మధ్య అంతర్గత పోరు ఎక్కువైందని... ఇది మోడీని ప్రధాని కాకుండా అడ్డుకుంటుందని చెప్పారు.