: కాంగ్రెస్ తలరాతను ప్రియాంక మార్చలేరు: అమిత్ షా
ప్రియాంకాగాంధీ కాంగ్రెస్ పార్టీకి టీఆర్పీ రేటింగులను సంపాదించగలరే గానీ, అంతకుమించి ఏమీ చేయలేరని, కాంగ్రెస్ తలరాతను మార్చలేరని మోడీ సన్నిహితుడు ఉత్తరప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ అమిత్ షా అన్నారు. ప్రియాంక తన తల్లి, సోదరుడి కోసం ప్రచారం చేస్తోందని... తాము యుద్ధ క్షేత్రంలో పోరాడుతుంటే, వారు వారి కోసం పోరాడుతున్నారని అమిత్ షా చెప్పారు. అమేథీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉందని వివరించారు.