: అంబానీ సోదరులు కలిసారు.. మార్కెట్ ఆనందించింది


ఎవరికి వారుగా విడిపోయిన అనంతరం.. ఇంతకాలానికి అంబానీ సోదరులు టెలికాం వ్యాపారం కోసం చేతులు కలిపారు.  ముఖేష్ కి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ - అనిల్ కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మధ్య ఇవాళ  ఓ భారీ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇక మీదట 4జీ సేవలకోసం ఆర్ కామ్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్స్ ను... రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఉపయోగించుకోనుంది. దాదాపు 12 వందల కోట్ల ఒప్పందమైన అంబానీల చర్య మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి.   

  • Loading...

More Telugu News