: పాయిఖానా కట్టించలేదని విడాకులు కోరిన భార్య


కాపురానికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు చెంబు పట్టుకెళ్లడం చూసిన విద్యాబాలన్, కొత్త కోడలు ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నిస్తుంది. కోడలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్తుందని ఆ అత్త చెబుతుంది. దీంతో బాత్రూమ్ కి దిక్కులేదు కానీ, మీ అబ్బాయికి పెళ్లి కావాల్సి వచ్చిందా? అంటూ విద్యాబాలన్ బుగ్గలు నొక్కుకుంటుంది. ఇది మరుగుదొడ్ల కోసం ప్రభుత్వం ప్రచురించిన అడ్వర్టైజ్ మెంట్. ఈ యాడ్ ని ఆదర్శంగా తీసుకుందో ఏంటో కానీ టాయిలెట్ కట్టించలేదని విడాకులు కోరిందో మహిళ.

బీహార్ లోని సదేషోపూర్ గ్రామానికి చెందిన అలఖ్ నిరంజన్ ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో టాయిలెట్ లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుందని అసౌకర్యానికి గురై భర్తను టాయిలెట్ కట్టించాలని కోరింది. అతను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ఆమె తనకు విడాకులు ఇప్పించాలని హెల్ప్ లైన్ ద్వారా కోర్టును ఆశ్రయించింది. దీంతో కేసు విచారణకు వచ్చింది.

  • Loading...

More Telugu News