: తమిళనాడులో మళ్లీ బాంబు పేలింది
చెన్నై రైల్వేస్టేషన్ లో బాంబు పేలుడు ఘటనను మరిచిపోకముందే తమిళనాడులో మళ్లీ బాంబు పేలింది. చిదంబరం పట్టణంలోని ఓ మెడికల్ షాపులో బాంబు పేలటంతో నలుగురికి గాయాలయ్యాయి. వారిలో అరుళ్ అనే యూనివర్శిటీ ఉద్యోగికి కంటి చూపు కూడా పోయింది.
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో జరిగిన బాంబు పేలుడులో ఇండియన్ ముజాహిదీన్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిదంబరం ఘటనలో మెడికల్ షాపు పైనున్న గదిలో బాంబులు తయారుచేస్తున్నారని, ఆ క్రమంలోనే బాంబు పేలి ఉంటుందని పోలీసులు అంటున్నారు.