: ఈ ఎన్నికల్లో విభజనవాదులకు బుద్ధి చెప్పండి: కిరణ్


మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని కడియంలో కిరణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తన లక్ష్యమని కిరణ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రం విడిపోవడానికి టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆయన అన్నారు. రాష్ట్రం కలిసుండాలని తాను కోరుకుంటున్నానని, అందుకోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశానని కిరణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో జేఎస్పీని గెలిపించి విభజనవాదులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News