: దూరదర్శన్ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు: మనీష్ తివారీ
ఇటీవల దూరదర్శన్ కు ఇచ్చిన మోడీ ఇంటర్వ్యూను సెన్సార్ చేసి ప్రసారం చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి మనీష్ తివారీ ఖండించారు. దూరదర్శన్ విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రసారభారతితో అంటీ ముట్టనట్లే ఉంటామని తెలిపారు. ప్రసార భారతి స్వయం ప్రతిపత్తికి పార్లమెంటు చట్టం ద్వారా హామీ ఉంటుందన్నారు.