: పార్కు స్థలాన్ని కబ్జా చేసిన వైఎస్సార్పీపీ నేత బాలశౌరిపై చర్యలు తీసుకోరేం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలశౌరి హైదరాబాదు, పంజాగుట్టలోని ప్రతాప్ నగర్ లో ప్రభుత్వ పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తూ ఇవాళ ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ విషయంపై బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం ఉద్యానవనం కోసం కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్న బాలశౌరి... అక్కడ కెన్నటా పవర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు తెలిపారు. పార్కు స్థలం ఆక్రమించిన విషయాన్ని ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వెంటనే ఆ నిర్మాణాన్ని కూల్చివేసి బాలశౌరిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.