: ఒక్క నిమిషంలోనే టీ రెడీ... కానీ, రూ.7.83 లక్షలు ఖర్చుపెట్టాలి!
రూ.7 లక్షల 83 వేలు ఖర్చు పెడితే చాలు... ఎంచక్కా ఒకే ఒక్క నిమిషంలో తేనీటిని తయారు చేసిచ్చే మిషన్ కొనుక్కోవచ్చు. అమెరికాకు చెందిన బికాన్ అనే కంపెనీ ఈ తేనీటి యంత్రాన్ని రూపొందించింది. అమెరికాలోని పలు కాఫీ షాపుల్లో ఈ తేనీటి యంత్రాలను పరిశీలించారు. ఈ మిషన్ పనితీరును పరిశీలించడం కూడా పూర్తయింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ టీ మిషన్ రావడానికి మరో ఏడాది పడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.