: ఆర్మీ కొత్త చీఫ్ నియామకానికి ఈసీ బ్రేక్ వేయనుందా?
బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో తదుపరి ఆర్మీ చీఫ్ నియామకానికి ఎన్నికల సంఘం బ్రేక్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిక్రంసింగ్ పదవీ కాలం జూలై 31తో ముగిసిపోతోంది. దీంతో తదుపరి ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ ను నియమించేందుకు కేంద్ర సర్కారు రంగం సిద్ధం చేసింది. అయితే, కొత్త ఆర్మీ చీఫ్ నియామకం ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వానికి వదిలిపెట్టాలని, ఎన్నికలు జరుగుతున్న సమయంలో దీన్ని చేపట్టవద్దని కోరుతూ బీజేపీ లోగడే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీ నేతలు ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తో భేటీ అవనున్నారు. దీంతో తదుపరి ఆర్మీ చీఫ్ నియామకంపై ఎన్నికల ఫలితాలు వెలువడే ఈ నెల 16 వరకు ఆగాలని ఈసీ కోరే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సోమ లేదా మంగళవారాల్లో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి.