: పాక్ భక్తులకు వీసా నిరాకరణ... భారత రాయబారికి సమన్లు
భారత రాయబారి గోపాల్ బగ్లేకు పాకిస్థాన్ ఈ రోజు సమన్లు పంపింది. అజ్మీర్ లోని హజరత్ క్వాజా మొయినుద్దీన్ చిస్తీని సందర్శించేందుకు ఆ దేశానికి చెందిన ఐదు వందల మంది భక్తులు వీసాకు దాఖలు చేసుకున్నారు. అందుకు భారత్ తిరస్కరించడంపై వివరణ కోరుతూ సమన్లు జారీ చేసింది. తమ దేశానికి చెందిన భక్తులకు వీసాను నిరాకరించడంపై సమన్లలో పాక్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు విదేశీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా వీసాను నిరాకరించడం నాలుగోసారని కూడా పాక్ పేర్కొంది. అయితే, దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ పాక్ భక్తులను అనుమతించడం చాలా కష్టతరమైన పని అని భారత్ వారికి తెలిపినట్లు సమాచారం.