: కాంగ్రెస్ నిర్ణయం వల్లే తెలుగుజాతి తీవ్రంగా నష్టపోయింది: కిరణ్
జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ మొండి పట్టుదలతో తెలుగు జాతి తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ తో పాటు టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీలు కూడా కారణమని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నానని చెప్పారు. రాష్ట్ర విభజనపై కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉందని... ఈ సందర్భంలో జైసపా అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని తెలిపారు.