: హైదరాబాద్ అయిపోయింది... ఇక గోదావరి కబ్జాకు రెడీ అవుతున్నారు: పవన్ కల్యాణ్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ అనుచరులు హైదరాబాదు చుట్టూ భూ కబ్జాలు చేశారు.... ఇప్పుడు గోదావరి జిల్లాలను దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తణుకులో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ దోపిడీ వల్లే రాష్ట్ర విభజనకు బీజం పడిందని అన్నారు. జగన్ హఠావో...సీమాంధ్ర బచావో అని పిలుపునిచ్చారు.

సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్ తాకట్టుపెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో వైఎస్ దోపిడీ వల్లే జగన్ ను రాళ్లతో తరమికొట్టారని పవన్ అన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన అన్నారు. తనపై దాడులు జరిగే అవకాశం ఉందని, అయినప్పటికీ తాను భయపడనని పవన్ కల్యాణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News