: బీసీలంతా టీడీపీకి ఓటేయండి: ఆర్.కృష్ణయ్య
ఆంధ్రప్రదేశ్ లోని బీసీలందరూ తెలుగుదేశానికే ఓటు వేసి మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెలంగాణలో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.కృష్ణయ్య కోరారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని టీడీపీయే పోరాడిందని, బీసీలను భుజానికెత్తుకుందని చెెప్పారు. అంతేకాక బీసీలకు ఆరు నెలల్లోపు రాజ్యాధికారం వచ్చేలా టీడీపీ చర్యలు తీసుకుంటుందని కృష్ణయ్య చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.