: విశాఖపట్నం మోడీ సభలో భారీ వర్షం... అయినా కదలని జనం
విశాఖపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో జరుగుతోన్న బహిరంగ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ వర్షం కురిసింది. అయినా సభకు వచ్చిన ప్రజలు, బీజేపీ అభిమానులు వర్షంలో తడుస్తూనే మోడీ ప్రసంగాన్ని విన్నారు. వర్షం వస్తున్నా లెక్కచేయక బీజేపీ భావి ప్రధాని ప్రసంగాన్ని వినడం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.