: ఐఐటీ, ఐఐఎం వంటి అత్యున్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తా: మోడీ


ఆంధ్రప్రదేశ్ లో యువతకు మంచి మేధస్సు ఉందని, తెలివితేటలు, నైపుణ్యాలున్న యువతకు మంచి భవిష్యత్తు కోసం తాను భరోసా ఇస్తానని మోడీ అన్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి అత్యున్నతమైన విద్యాసంస్థలను నెలకొల్పుతామని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో కూర్చున్న తల్లీ కొడుకుల వల్ల దేశాభివృద్ధి సాధ్యం కాదని, కేంద్రంలో ఏర్పడనున్న బీజేపీ ప్రభుత్వంతోనే అది సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News