: మోడీపై కేసు నమోదు చేయడంపై జైట్లీ ఆగ్రహం
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేయడంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఈసీ చాలా తొందరపాటు పని చేసిందని తన బ్లాగులో అన్నారు. మోడీ అహ్మదాబాద్ లో ఓటు వేసిన అనంతరం బయట మీడియాతో మాట్లాడారు కానీ, అది పబ్లిక్ మీటింగ్ కాదన్నారు. ఎవరో ఏదో అన్నారని ఇలా చర్యలు తీసుకోవడం సరికాదని జైట్లీ ఈసీకి సూచించారు. అలాగే అసోంలో ఓటు వేసిన అనంతరం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడారని, ఇది అందరూ చేస్తుంటారని పేర్కొన్నారు.