: ప్రతి పొలానికి నీరు, ప్రతి చేతికి పని కల్పించడమే మా లక్ష్యం: నరేంద్ర మోడీ
నెల్లూరులో పుట్టిన మీ వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఎలా పోరాడారో మీకు తెలుసని మోడీ చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా రావడానికి వెంకయ్య నాయుడే కారణమని ఆయన అన్నారు. నెల్లూరులో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిసిందని, తాగునీటి సమస్య, వ్యవసాయానికి తగినంత సాగునీరు కావాలంటే టీడీపీ-బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రతి పొలానికీ నీరు, ప్రతి చేతికి పని తమ లక్ష్యమని మోడీ చెప్పారు. భారీ మెజారిటీతో టీడీపీని గెలిపించాలని మోడీ ప్రజలను కోరారు. భారతదేశంలోని యువతలో ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, యువత నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే దేశం ముందుకు వెళుతుందని ఆయన అన్నారు.