: పూర్వీకుల స్థలం స్వాధీనం కోసం మీరా కుమార్ పిటిషన్


లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ తన పూర్వీకుల స్థలం కోసం పాట్నా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. బీహార్ లోని భోజ్ పురిలోని కొంతమంది మీరా కుమార్ స్థలాన్ని ఆక్రమించారని, అందుకే పిటిషన్ వేసినట్లు ఆమె లాయర్ సంజయ్ కుమార్ ఓజా తెలిపారు. భోజ్ పురి జిల్లాకు అరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్వా ప్రాంతంలో ఆమె తండ్రి, మాజీ ఉప ప్రధానమంత్రి జగజ్జీవన్ రామ్ పేరుతో ఉన్న 81 ఎకరాల స్థలంలో పలువురు ఇళ్లు నిర్మించుకున్నారని చెప్పారు. ఇప్పుడా ఇళ్లను కూల్చివేయడం లేక తొలగించేందుకు ఆదేశాలివ్వలంటూ పిటిషన్ లో మీరా కుమార్ కోరినట్లు న్యాయవాది వివరించారు. గతంలో ఇదే విషయంపై ఓసారి పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.

  • Loading...

More Telugu News