: పంజాబ్ సీఎంకు ఈసీ షోకాజ్ నోటీసు
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. జలంధర్ లో ఎన్నికల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రచారంకోసం పార్టీకి రహస్యంగా నిధులు ఇవ్వాలంటూ కోరారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే పంజాబ్ కాంగ్రెస్ నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్న ఈసీ, ఇలాంటి ప్రకటనలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఇతరులను కూడా చట్టం ఉల్లంఘించేందుకు ప్రోత్సహించారంటూ నోటీసులో పేర్కొంది. శుక్రవారంలోగా నోటీసుపై స్పందించాలని తెలిపింది.