: కేసీఆర్ ను తిట్టే ధైర్యం జగన్ కు లేదు: పవన్
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎన్డీఏ బహిరంగ సభ ప్రారంభమైంది. నరేంద్రమోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ సభలో పాల్గొన్నారు. ముందుగా జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ, కేసీఆర్ తిడుతున్నా జగన్ ఒక్క మాట మాట్లాడరని ఆరోపించారు. కేసీఆర్ ను అనే ధైర్యం జగన్ కు లేదన్నారు. అసలు వారిద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అటు వైఎస్ దోపిడీ విధానం వల్లే తెలంగాణ సమస్య తెరపైకి వచ్చిందని, హైదరాబాదు, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాలో సెజ్ ల పేరిట దోచుకున్నారని విమర్శించారు. సీమాంధ్ర పౌరుషం, దమ్ము, ధైర్యం జగన్ కు లేవా? అన్న పవన్, సీమాంధ్ర గౌరవాన్ని కాపాడలేని జగన్ కు సీఎం పదవి ఎందుకని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే దోఫిడీ దొంగల రాజ్యమేనని అన్నారు. సాక్షి పేపర్ తనపై అనుచిత విమర్శలు చేస్తోందన్నారు. తండ్రి చనిపోతే తాను సీఎం కావడానికి సంతకాలు చేయించాడన్నారు. ఇక రాష్ట్రాన్ని విడదీసింది తల్లీకొడుకులు సోనియా, రాహుల్లేనని ఆయన విమర్శించారు.