: పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి సర్వేకు చేదు అనుభవం
కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చేదు అనుభవం ఎదురయింది. ఈ ఉదయం ఇక్కడ అభివృధ్ధి పనుల శంకుస్థాపనకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయనను భీమవరం పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 'సర్వే గో బ్యాక్' అంటూ ఆందోళనతో నినాదాలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. చివరికి సర్వే మాట్లాడుతూ.. మంత్రిగా తానా వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్నారు. కేంద్ర మంత్రి పదవిలో ఉండి అటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు.