: జగన్ పార్టీ... ఆలీబాబా 40 దొంగల పార్టీ: జైరాం రమేష్


కేంద్ర మంత్రి జైరాం రమేష్ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్ ను ఎన్నుకుంటే... రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జగన్ పార్టీ అయిన వైఎస్సార్సీపీ... ఆలీబాబా 40 దొంగల పార్టీ అని ఎద్దేవా చేశారు. జగన్ చేతిలో ఓ అద్భుత దీపం ఉందని... అందుకే అతి తక్కువ కాలంలోనే ఎవరూ సంపాదించలేనంత సంపాదించారని ఆరోపించారు. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ ఖర్చు చేయనంతగా వైకాపా ఖర్చు చేస్తోందని విమర్శించారు. వైకాపా కుబేరుల పార్టీ అని జైరాం ఆరోపించారు.

  • Loading...

More Telugu News