: జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కాబోతున్నాడు
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కాబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఎన్టీఆర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఎన్నికల సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. జూబ్లిహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు కుటుంబ సమేతంగా జూనియర్ ఎన్టీఆర్ తరలి వచ్చారు. దీంతో చాలాకాలంగా మీడియా ముందుకు రాని లక్ష్మీ ప్రణతి మీడియాకు కనిపించారు.
దీంతో ఆమె గర్భవతి అన్న విషయం నిర్ధారణ అయింది. ఇప్పుడామె ఏడు నెలల గర్భవతి అని సమాచారం. ఈ మధ్యే తండ్రయిన అల్లు అర్జున్ పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతుండగా, జూనియర్ ఎన్టీఆర్ కు కూడా త్వరలోనే ఆ అదృష్టం వరించనుంది. అల్లు అర్జున్ కుమారుడి పేరు ఆయాన్.