: టాక్ ఆఫ్ ది ఎలక్షన్... కేసీఆర్ ఓటు!


మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గంలోని చింతమడకలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన భార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటే టాక్ ఆఫ్ ది ఎలక్షన్ అయింది. ఓటు వేసేందుకు హెలికాప్టర్ వినియోగించడం కేసీఆర్ కే చెల్లిందని రాజకీయ పక్షాలు అంటుండగా, సోషల్ నెట్ వర్క్ లో నెటిజన్లు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు.

ఓటెయ్యడానికి హెలికాప్టర్ వాడుతుంటే, 'ఎవడ్రా... తెలంగాణ వెనకబడి ఉందని గగ్గోలు పెట్టేది?' అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ ఏకి పారేస్తున్నారు. మరి కొంత మంది ఇంకాస్త ముందుకెళ్లి, 'నడమంత్రపు సిరి, నడుం మీద పుండు నిలవనీయవంటే ఇదే' అని కేసీఆర్ ఫోటో పెట్టి మరీ వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News