: అందరూ బాధ్యతగా వ్యవహరించాలి: చంద్రబాబు


ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఇంకా విడిపోలేదని, అపాయింటెడ్ డే కూడా ఇంకా ముందు ఉందని ఆయన అన్నారు. కేంద్రం చేసిన అమానుషానికి వ్యతిరేకంగా తాము మొదటినుంచీ పోరాడుతున్నామని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రం విడిపోయిందని కొందరు అమితానందంలో ఉన్నారని, అయితే రాష్ట్రాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News