: మోడీ నిబంధనలు ఉల్లంఘించారు: కాంగ్రెస్
పోలింగ్ బూత్ వద్ద గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. అహ్మదాబాద్ లోని రాణిప్ ప్రాంతంలో ఓటేయడానికి వచ్చిన సందర్భంగా మోడీ పార్టీ గుర్తు కమలాన్ని చేత్తో పట్టుకుని మీడియాతో మాట్లాడారు. దీనిపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. పోలింగ్ రోజున కమలం చిహ్నాన్ని వినియోగించడంపై ఆమ్ ఆద్మీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తుందా? అని ఆ పార్టీ నేత అశుతోష్ ప్రశ్నించారు.