: ఓటు వేయడానికి అంబులెన్స్ లో వచ్చిన ఎర్రబెల్లి
ఎన్నికల ప్రచారం చివరి రోజున అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అస్వస్థతతో ఉన్న ఆయన అంబులెన్స్ లోనే పోలింగ్ బూత్ కు వచ్చారు. అయితే, ఏజంట్లు రావడం ఆలస్యం కావడంతో ఆయన పది నిమిషాల సేపు పోలింగ్ బూత్ లోనే వేచి ఉన్నారు.