: ఓటు వేసిన గవర్నర్ దంపతులు
రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్ భవన్ ఎదురుగా ఉన్న రాజ్ నగర్ లోని 111వ పోలింగ్ బూత్ లో గవర్నర్ దంపతులు ఓటు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఓటు హక్కు ఎంతో విలువైందని, ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.