: విజయమ్మ ఆమరణ దీక్ష షురూ అయింది
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇవాళ్టినుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ముందుగా బషీర్ బాగ్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, అక్కడి నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని కరెంట్ సత్యాగ్రహం దీక్షావేదిక వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె వెంట నడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, నిన్న రాత్రి జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో విజయమ్మ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించిన సంగతి మనకు తెలుసు.