: చేతి సైగల్ని పసిగట్టే కొత్త రకం కీబోర్డు
కంప్యూటర్ కీబోర్డుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ కొత్త రకం కీబోర్డులను మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ గ్రూప్ రూపొందించింది. యూజర్ చేతి సైగల్ని పసిగట్టి దానికి తగ్గట్టు ప్రవర్తించడమే ఈ కొత్త రకం కీబోర్డు ప్రత్యేకత. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు లో ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్స్ ను ఎంబెడ్ చేసి కీబోర్డుకు ప్రత్యేకత తీసుకువచ్చారు. కీ క్యాప్ ద్వారా ప్రతి సెన్సార్ లింకునూ ట్రాక్ చేసి, యూజర్ చేతి సైగల్ని పసిగడుతుందని మైక్రో సాఫ్ట్ ప్రతినిధులు వెల్లడించారు.
ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చేతి కదలికలకు అనుగుణంగా ఇది స్పందిస్తుందని వారు స్పష్టం చేశారు. పైకి, కిందకి, కుడి, ఎడమలకు కదిలే విధంగా చూడడం, ఏదైనా చిత్రాన్ని జూమ్ చేయడం లాంటి కదలికలను పసిగడుతుందని వారు వెల్లడించారు.