: కాకినాడలో ‘ఓటరు దేవుళ్ల’కు ఆఫర్లే ఆఫర్లు!
తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణమైన కాకినాడలో ‘ఓటరు దేవుళ్ల’ను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగా వారికి ఇవాళ మధ్యాహ్నం మాంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అంతేనా, కడుపు నిండా తిన్న తర్వాత వారికి ‘మీరు మాకే ఓటు వేయాలి’ అంటూ కొంత నగదును కూడా ముట్టజెప్పారు. కాకినాడలోని వీఎస్ కాలేజ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వేణు ఆధ్వర్యంలో ఈ విందు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అయితే, చివరలో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయిన ఈ తంతును మీడియా సిబ్బంది వచ్చి వీడియో తీయడడంతో ఈ భాగోతం బయటపడింది.