: దూరదర్శన్ సాక్షిగా... అందరూ చూస్తుండగా దారుణం


దేశం నివ్వెరపోయే ఘటన ఉత్తరప్రదేశ్ దూరదర్శన్ కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో దూరదర్శన్ టీవీ ఛానెల్ ఎంపీ అభ్యర్థుల ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసింది. కార్యక్రమం రసవత్తరంగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలతో కార్యక్రమాన్ని అభ్యర్థులు రక్తికట్టిస్తున్నారు. ఇంతలో కిరోసిన్ తో నిండా తడిసిన ఓ యువకుడు వేదికపైకి దూసుకొచ్చాడు.

చర్చలో పాల్గొన్నవారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు తనకు తాను నిప్పంటించుకున్నాడు. వెంటనే బీఎస్పీ అభ్యర్థి కమరుజ్జీమా ఫౌజీని కౌగిలించుకున్నాడు. వారిని విడిపించే సరికి యువకుడు 95 శాతం కాలిన గాయాలతోనూ, ఎంపీ అభ్యర్థి కమరుజ్జీ 75 శాతం కాలిన గాయాలతో మిగిలారు. దీంతో ఇద్దర్నీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా వీరిని విడదీసేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఆ యువకుడెవరు? ఎందుకిలా చేశాడు? అన్నది ఇంకా తెలియలేదు. ఈ ఘటన దూరదర్శన్ సాక్షిగా జరగడంతో సంచలనం సృష్టించింది.

  • Loading...

More Telugu News