: రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ రేపే
మన రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో రేపు (తొలి దశ) పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 6 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారిని మాత్రం... ఎంత సమయమైనా వారు ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు అనుమతిస్తారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ కు ఎలాంటి అంతరాయం, ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు భారీ ఎత్తున కేంద్ర బలగాలను, పోలీసులను నియమించారు.