: కాంగ్రెస్ కి టాటా చెప్పేశా... బీజేపీలో చేరుతున్నా: కావురి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, మే 1న భీమవరంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. రాష్ట్ర విభజన నాడే తాను కాంగ్రెస్ పార్టీతో విభేదించానని ఆయన వెల్లడిచారు.